సమీకృత వ్యవసాయం ద్వారా అధిక లాభాలు
పర్లాకిమిడి: సమీకృత వ్యవసాయం ద్వారా రైతులు ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని సెంచూరియన్ వర్సిటీ ఎంఎస్ స్వామినాథన్ అగ్రికల్చర్ కళాశాల డీన్ సత్యప్రకాష్ నంద అన్నారు. వ్యవసాయ విద్యార్థులు ఆధునిక యంత్రాలు, మెలకువలు తెలుసుకుని వ్యవసాయ క్షేత్రం, ల్యాబ్‌కు మధ్య వ్యత్యాసం గ్రహించాలని అన్నారు. స్థానిక సెంచూరియన్ వర్సిటీలో మూడో ఉత్కళ కృషి మేళా 2025 మంగళవారంతో ముగిసింది. ఈ ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా ఒడిషా మిల్లెట్ క్వీన్ డాక్టర్ రైమతీ ఘురియా, సంజీవనీ ఎన్.జి.ఓ.(ఆంధ్రప్రదేశ్) దేవులు పచేరీ తదితరులు పాల్గొన్నారు. గుమ్మా సమితికి చెందిన గిరిజన మహిళలు తృణధాన్యాలు అయిన రాగులు, జొన్నలు, చోడి పంటల అనుభావాన్ని తెలియజేశారు. బీఎస్సీ (అగ్రి) విద్యార్థి దిలీప్ బరాల్ సంబల్‌పురి డ్యాన్స్ వేసి అందరినీ అలరించారు. రైస్ మేన్ ఆఫ్ ఒడిషా సుధాం సాహు, మయూర్‌భంజ్ నుంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్ ప్రహ్లాద మహాంత, భూదేవి పాల్గొని వేదికపై మాట్లాడారు. వారిని సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య డి.ఎన్.రావు జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం ఆయన వ్యవసాయ, పశుపాలన, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్స్‌ను సందర్శించారు.
సమీకృత వ్యవసాయం ద్వారా అధిక లాభాలు
సమీకృత వ్యవసాయం ద్వారా అధిక లాభాలు


