
కార్యాలయానికి తాళాలు వేసిన కౌన్సిలర్లు
కొరాపుట్: నబరంగ్‌పూర్ మున్సిపల్ కార్యాలయానికి వైస్ చైర్మన్ సౌమ్య మహాపాత్రో, కౌన్సిలర్లు బుధవారం తాళాలు వేశారు. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ బిశ్వప్రియ దాస్ ఏకచత్రాధిపత్యం చేస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని, గెలిపొందిన ప్రజాప్రతినిధులను చులకనగా చూస్తున్నారని ఆరోపించారు. గతంలో అతనిపై పార్టీలకు అతీతంగా కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రోకి ఫిర్యాదు చేయడంతో వారం రోజుల్లో బదిలీ చేస్తా మని హామీ ఇచ్చారన్నారు. కానీ నెల రోజులు పూర్త య్యినప్పటికీ బదిలీ జరగకపోవడంతో ఈవిధంగా నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇది తెలిసి మున్సిపల్ చైర్మన్ కును నాయక్ కార్యాలయం వద్ద కు చేరుకున్నారు. పరిస్థితిని జిల్లా కలెక్టర్‌కి ఫోన్‌లో వివరించారు. వారం రోజుల్లో ఇంజినీర్‌ని బదిలి చేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎ.సతీష్ (బీజేపీ), మురళి(ఇండిపెండెంట్), రంజితా పండా(బీజేడీ), రామో నాయక్ (బీజేడీ) తదితరులు పాల్గొన్నారు.