భక్తిశ్రద్ధలతో ఏకాదశి పూజలు
రాయగడ: స్థానిక బాలాజీ నగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో చైత్ర ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో పూజలు వైభవంగా జరిగాయి. కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జనావాసాల్లోకి జింక
పర్లాకిమిడి: తాగునీటి వనరులు లేకపోవడంతో జంతువులు జనవాసాల్లోకి వస్తున్నాయి. మహేంద్ర తనయ నదిలో నీరు అడుగంటిపోవడంతో సోమవారం మధ్యాహ్నం ఓ కణితి (సాంబారు జింక) తాగునీటి కోసం గుసానిసమితి అభివృద్ధి అధికారి గౌరచంద్ర పట్నాయిక్ నివాసానికి వచ్చింది. ఆయన వెంటనే తా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి జింకను అడవుల్లో సురక్షితంగా వదిలిపెట్టారు.
రాయగడలో భారీ వర్షం
రాయగడ: జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కళ్యాణసింగుపూర్ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా గల చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రాయగడ పట్టణంలో సుమారు గంటన్నర సమయం కుండపోత వర్షం కురిసింది. స్థానిక రైతుల కాలనీ, ఆర్‌కే నగర్, కస్తూరీ నగర్ తదితర ప్రాంతాల్లో చెట్టు కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడిపొవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపొయింది.
భక్తిశ్రద్ధలతో ఏకాదశి పూజలు
భక్తిశ్రద్ధలతో ఏకాదశి పూజలు


