
తగ్గిన దిగుబడి
జీడిమామిడి..
వజ్రపుకొత్తూరు ప్రాంతంలో నల్లగా మాడి పిందె దశలోనే ఉన్న జీడి పంట
దెబ్బకొట్టిన వర్షాభావం..
జిల్లాలో దాదాపు రెండున్నర నెలలుగా వర్షం కురవకపోవడం, అకాల వర్షం ప్రభావం జీడి మామిడి పంటపై పడిందని రైతులు చెబుతున్నారు. జీడిమామిడి తోటలకు నీరు పెడితే మంచి కాపు ఇస్తుందని ఉద్యానవన శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ప్రస్తుతం జీడిమామిడి తోటలు అధికంగా ఉద్దానం, కొండపోడు భూములు, రాళ్ల ప్రదేశాల్లో సాగు చేస్తున్నారు. ఈ తరహా తోటలకు నీరు అందే అవకాశం ఏమాత్రం లేకపోవడం కూడా జీడిమామిడి పంటల దిగుబడి తగ్గిపోవడానికి కారణమని రైతులు చెబుతున్నారు. వరుసగా మూడేళ్లుగా పంట నష్టం వాటిల్లడంతో, ఇక జీడిమామిడి తోట సాగు వృథా అనే నిర్ణయానికి వచ్చిన రైతులు చాలా తోటలను నరికి కలపగా విక్రయిస్తున్నారు. జిల్లాలో దాదాపు 38,930 ఎకరాల్లో జీడి మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇటీవల చెట్లు జీర్ణావస్థకు వచ్చి మరికొన్ని చోట్ల తోటలను నరికివేయడం వల్ల జీడిమామాడి తోటల విస్తీర్ణం జిల్లాలో 10 వేల ఎకరాలకు పడిపోయిందని పలువురు చెబుతున్నారు.
ఆశలు ఆవిరి..
జీడి పంటపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ఎకరాకు ఆరు బస్తాలు దిగుడి వస్తుందని భావించాం. వాతావరణంలో మార్పులతో పిందె మాడిపోయి పిక్కలకు బూజు పట్టి దిగుబడిపై ప్రభావం చూపింది. ఎకరాకు ఒక బస్తా కూడా రాని పరిస్థితి వచ్చింది.
– దున్న నాగేశ్వరరావు,
యూఆర్‌కేపురం, వజ్రపుకొత్తూరు మండలం
శాస్త్రవేత్తలను తెచ్చాం
వజ్రపుకొత్తూరు పూండి ఉద్దా నం ప్రాంతంలో సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు పెద్దపేట, జీడిపరిశోధన కేంద్రం(బాపట్ల) నుంచి శాస్త్రవేత్తలను తెప్పించి రైతులకు అవగాహన కల్పించాం. ఐదు మండలాలకు ఉద్యా నవన శాఖ అధికారిగా ఉన్నాను. వాతావరణంలో మార్పులకు ఎవరూ ఏమీ చేయలేరు.పిండి నల్లి ఉద్ధృతంగా ఉండటం వల్ల రైతులకు నష్టం వాటిల్లింది. మందులు ఏం వాడాలో రైతులకు వివరించాం. – కె.సునీత, ఉద్యానవన శాఖ అధికారి
ధరల పతనం..
జిల్లాలో వజ్రపుకొత్తూరు మండలంలో 11706, మందసలో 8069, పలాసలో 4575, రణస్థలంలో 1720, సోంపేటలో 1950, కంచిలిలో 1173, సీతంపేటలో 6539, కవిటిలో 1270, ఎచ్చెర్లలో 1935 ఎకరాల్లో రైతులు జీడిమామిడి పంట సాగు చేస్తున్నారు. గత రెండు వారాల్లో జీడి మామిడి ధర రోజు రోజుకూ తగ్గుతూ వస్తోంది. సీజన్ తొలి రోజుల్లో ( బస్తా 80 కిలోలు) రూ.14000 పలకగా.. ప్రస్తుతం రూ.12వేలు (కిలోరూ.150)కు పడిపోయింది. అసలే పంట దిగుబడి లేక దిగాలు పడ్డ రైతులు ధర కూడా తగ్గిపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జీడి మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
కొత్తపేట, అమలపాడు, యూఆర్‌కేపురంతో పాటు పలాస, సీతంపేట, కవిటి, కంచిలి, మందస, రణస్థలం ప్రాంతాల్లో ఎక్కువగా నష్టం ఉంది. ఏ మందు ఎంత మోతాదులో వాడితే మంచి ఫలితం ఉంటుందో ఉద్యానవన శాఖ అధికారులు తమకు అవగాహన కల్పించడం లేదని కొందరు రైతులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ ప్రక్రియ ప్రాథమిక దశలోనే జరగాలి. కానీ ఉద్దానం ప్రాంతంలో ఉద్యానవన శాఖ ద్వారా జీడిమామిడి రైతులకు సలహాలు సూచనలు మొక్కుబడిగా ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదు మండలాలకు ఒకే ఒక్క ఉద్యానవన శాఖ అధికారి ఉండటం వల్ల కూడా రైతులకు సలహాలు, సూచనలు సకాలంలో అందని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత సీజన్‌లో రైతులకు చేరువగా, పంటను కాపాడేందుకు ఉండాల్సిన విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు చాలా మంది సచివాలయాలకే పరిమితమవుతున్నారని జీడిమామిడి రైతులు వాపోతున్నారు. దీంతో చాలామంది రసాయన మందులపై అవగాహన లేక ఇష్టానుసారంగా పురుగు మందు పిచికారీ చేస్తున్నారు. దీని వల్ల తోటల్లో పూత మాడిపోయి పిందె రాకుండా పోయిందని రైతులు చెబుతున్నారు.

తగ్గిన దిగుబడి

తగ్గిన దిగుబడి

తగ్గిన దిగుబడి