పర్లాకిమిడి: స్థానిక మహారాజా బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాల మైదానంలో పీఎం శ్రీ వార్షిక ఆటల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో సీనియర్, జూనియర్ విభాగాలలో వందమీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్‌పుట్, కబాడీ, మ్యూజికల్ ఛైర్, స్లోసైకిల్ రేస్, స్కిప్పింగ్ లెమన్ రేస్ పోటీలను శిక్షకులు నిర్వహించారు. ఈ పీఎం శ్రీ వార్షిక పోటీలను ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు యస్.కిరణ్ ప్రారంభించగా, శిక్షకులు మహేంద్ర బోడోముండి, ఇతర శిక్షాయిత్రిలు పాల్గొన్నారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో విజేతలకు పాఠశాల వార్షిక దినోత్సవంలో అందజేస్తామని హెచ్‌ఎం కిరణ్ తెలియజేశారు.
సందడిగా ఆటల పోటీలు