ఉత్సాహంగా సరస్వతి శిశు మందిర్ వార్షికోత్సవం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల 26వ వార్షికోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సంగ్ మడ్కామి కార్యక్రమంలో పాల్గొన్నారు. 1995లో ప్రారంభమైన సరస్వతీ శిశుమందిర్ ఎంతోమందిని ఉత్తములుగా తీర్చిదిద్దింది. 2023–24 విద్యాసంవత్సరంలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో 498 మార్క్‌లతో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని లిప్సరాణి పండాకు వెయ్యి రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. జిల్లా అదనపు కలెక్టర్ సోమానాధ్ ప్రధాన్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారి టంగులు, పాఠశాల కమిటీ అధ్యక్షుడు ఆశోక్ చక్రవర్తి పాల్గొన్నారు.
ఉత్సాహంగా సరస్వతి శిశు మందిర్ వార్షికోత్సవం


