సిద్ధిదాత్రిగా జగులైమాత దర్శనం
భువనేశ్వర్: జట్నీ మున్సిపాలిటీ కుదియయారి గ్రామ దేవత జగులైమాత వసంత నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవా ల్లో తొమ్మిదో రోజు ఉదయం సూర్యపూజ అనంతరం అమ్మవారు నగర పరిక్రమలో భాగంగా గ్రామంలోని అన్ని దేవతలను కలిసిన తర్వాత పెద్ద అక్క దేవస్థానం సందర్శించింది. రోజంతా భక్తుల పూజలు అందుకుంది. సాయంత్రం వేళలో సొంత ఆలయానికి తిరిగి చేరింది. స్వస్థానంలో మహాస్నానం జరిగిన తర్వాత జగులైమాత సిద్ధిదాత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. షోడశోపచా ర పూజలు, సప్త్తసతీ చండీ ఆహుతి వంటి ప్రత్యేక పూజాదులతో ఉత్సవ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణతో చిన్నారులు కుమారి పూజ ఉత్సవంలో భక్తిశ్రద్ధలతో పాలుపంచుకున్నారు.
సిద్ధిదాత్రిగా జగులైమాత దర్శనం


