
‘అక్రమంగా గుగ్గిలం చెట్లు తరలింపు’
జయపురం: సబ్ డివిజన్ పరిధి బొరిగుమ్మ సమితి బొడొనాయికగుడ అటవీ ప్రాంతంలో విలువైన గుగ్గిలం చెట్లను కొంతమంది ఇతర రాష్ట్రాలకు అమ్మేందుకు తరలిస్తున్నారని ఆ ప్రాంత అటవీ సురక్ష కమిటీ కార్యదర్శి గోపీనాథ్ గదబ ఆరోపించారు. ఈ మేరకు జయపురం అటవీ డివిజన్ అధికారి ప్రతాప్ బెహరాను బుధవారం కలిసి ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఆరుగురు వ్యక్తులు 5 విలువైన గుగ్గిలం చెట్లను కొట్టి అమ్మేశారని ఆరోపించారు. ఘటనపై దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఫిర్యాదుదారుల్లో నకుల్ గదబ, మనోహర గదబ, లక్ష్మణ గదబ, సోను గదబ తదితరులు పాల్గొన్నారు.