
గంజాం బార్ అసోసియేషన్ ఎన్నిక
బరంపురం: గంజాం బార్ అసోసియేషన్‌ను న్యాయవాదులు ఎన్నుకున్నారు. సోమవారం బార్ అసోసియేషన్ తాత్కాలిక కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకారంలో న్యాయవాది మనోజ్ పట్నాయక్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా వెంకటరావు, సహాయ కార్యదర్శులుగా త్రిముల్ కుమార్‌రెడ్డి, అసిత్ సావత్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలపై పోరాడతామన్నారు. సంక్షేమం కోసం పాటుపడతామన్నారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన న్యాయవాది మోహన్ శింగారి నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ అధ్యక్షుడు నయన్ చంద్ర మహాపాత్రో, ఎడిటర్ బిరించి మహాపాత్రో, రామ్‌ప్రసాద్ పండా, తదితరులు పాల్గొన్నారు.