
14న హిందూ ఏక్తా వాహినీ ర్యాలీ
కొరాపుట్: నబరంగ్‌పూర్ హిందూ ఏక్తా వాహీనీ ఆధ్వర్యంలో సుమారు 30 వేల మందితో ఈనెల 14న భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు జిల్లా కన్వీనర్ గౌరీ శంకర్ సాహు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు స్థానిక రాజువీధిలోని గణేష్ దేవాలయంలో జరిగిన మీడియా సమావేశం ఈ విషయాన్ని వెల్లడించారు. పొణ సంక్రాంతి, హనుమన్ జయంతి, మహా బిషు సంక్రాంతి, ఒడియా నూతన సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఆ రోజున మెయిన్ రోడ్డులో చమిరియా గుడ వద్ద సాయంత్రం మూడు గంటలకు ర్యాలీ ప్రారంభమై పోలీస్ గ్రౌండ్స్ వరకు కొనసాగుతోందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో పూసర్ల సంతోష్, అనంత పండా, నీలి బాబు త్రిపాఠి, బాబు యాదవ్, సిసిర్ గంతాయిత్ ఉన్రరు.