పర్యాటకుల బస్సు బోల్తా | - | Sakshi
Sakshi News home page

పర్యాటకుల బస్సు బోల్తా

Apr 7 2025 12:29 AM | Updated on Apr 7 2025 12:29 AM

పర్యాటకుల బస్సు బోల్తా

పర్యాటకుల బస్సు బోల్తా

పవిత్ర శ్రీ రామ నవమి పురస్కరించుకుని రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం పూరీ శ్రీ జగన్నాథ దేవస్థానం మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా శ్రీ రామచంద్ర స్వామి పూజాదులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానాల ప్రాంగణాలు ప్రత్యేక పుష్ప సోయగంతో కళకళలాడాయి. హోమాదులతో ఆధ్యాత్మిక వాతావరణం అలముకున్నాయి. – భువనేశ్వర్‌

ఒకరు మృతి

భువనేశ్వర్‌: నగరం శివార్లలో ఆదివారం వేకువ జామున భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానిక ఉత్తర క్రాసింగ్‌ ప్రాంతం సిఫా కూడలి కౌశల్యాగంగ పోలీసు ఔట్‌ పోస్ట్‌ దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పర్యాటకుల బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 15 మందికి పైగా పర్యాటకులు గాయపడ్డారు. వారందరినీ స్థానిక క్యాపిటల్‌ ఆస్పత్రిలో చేర్చారు. ఒకరు మృతి చెందారు. పూరీ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. డ్రైవర్‌ కునుకుపాటు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. బస్సులో దాదాపు 70 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. వీరంతా బంగ్లాదేశ్‌ నుంచి ఇస్కాన్‌ సహాయంతో పూరీ శ్రీ జగన్నాథుని దర్శనం కోసం విచ్చేశారు. కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించిన తర్వాత పూరీ వెళ్తుండగా దురదృష్టవశాత్తు దుర్ఘటన పాలయ్యారు. ప్రయాణికుల్లో అత్యధికులు పశ్చిమ బెంగాల్‌లోని ఇస్కాన్‌ మాయాపూర్‌ ఆధ్వర్యంలో వచ్చిన బంగ్లాదేశ్‌ జాతీయులు అని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement