వక్ఫ్ సవరణ బిల్లు ఓటింగ్‌పై చర్యలు
భువనేశ్వర్: రాజ్య సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై బిజూ జనతా దళ్ వైఖరి పట్ల సందిగ్ధత తొలగడం లేదు. మరో వైపు ఈ బిల్లు సవరణకు సానుకూలంగా ఓటు వేసినట్లు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సస్మిత్ పాత్రో బహిరంగ పరిచారు. ఆయనతో మరో ఒకరు, ఇద్దరు సభ్యులు కూడా సానుకూలంగా ఓటు వేసినట్లు వదంతులు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ బిల్లు సవరణకు వ్యతిరేకంగా ఓటు వేసిన బీజేడీ సభ్యుడు మున్నా ఖాన్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌తో ఆయన నివాసంలో సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బలహీన వర్గాల ప్రతినిధి బృందం కూడా నవీన్ పట్నాయక్‌తో ముఖాముఖి తమ గోడుని వినిపించింది.
వక్ఫ్ సవరణ బిల్లుపై సానుకూలంగా ఓటు వేసిన బీజేడీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఈ బృందం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్‌కు తమ గోడుని వినిపిస్తూ... మీరు కేవలం రాజకీయ నాయకుడు కాదు. మీరు మాకు కుటుంబం.. మీరు న్యాయం చేయాలని బీజేడీ అధ్యక్షుడిని కలిసిన ప్రతినిఽధి బృందం అభ్యర్థించింది. వారి గోడుని ఆలకించిన నవీన్ పట్నాయక్ వక్ఫ్ బిల్లుపై రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌పై తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో ఏమాత్రం వెనుకంజ వేసేది లేదని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేడీ ఒక లౌకిక పార్టీ అని పేర్కొన్నారు. ఈ ఆదర్శంతో కంధమల్ అల్లర్ల తర్వాత రాష్ట్రంలో బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకుందని ప్రతిపక్ష నాయకుడు.. ప్రతినిధి బృందానికి గుర్తుచేశారు.
మాజీ సీఎం నవీన్ పట్నాయక్


