ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం
పర్లాకిమిడి: సీఎం ట్రోఫీ కోసం గజపతి జిల్లా స్థాయి ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలను స్థానిక గజపతి స్టేడియంలో సోమవారం ఉదయం కలెక్టర్ బిజయకుమార్ దాస్ ప్రారంభించారు. ఈ పోటీలకు 15 ఏళ్ల లోపు విద్యార్థులు 176 మంది జిల్లాలో పలు ఉన్నత విద్యాలయాల నుంచి హాజరయ్యారు. ఈ పోటీలకు జిల్లా ఎస్పీ జితేంద్రనాథ్ పండా, క్రీడాధికారి కమలకాంత పండా, జిల్లా ముఖ్యశిక్షాధికారి మాయాధర్ సాహు, డి.సి.పి.యు అరుణ్‌కుమార్ త్రిపాఠి తదితరులు హాజరయ్యారు. విద్యార్థులు చదువుతోపాటు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొనటం వల్ల ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఈ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ఈ నెల 13వ తేదీ వరకు జరుగుతాయని జిల్లా పీఈటీ సురేంద్రకుమార్ పాత్రో తెలియజేశారు. ఈ ఫుట్‌బాల్ పోటీలకు వివిధ విద్యాలయాల నుంచి పీఈటీలు ధర్మేంధ్ర సామల్, రేఖారానీ దేవ్, తదితరులు పాల్గొన్నారు.
రాయగడలో..
రాయగడ: స్థానిక గొవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ముఖ్యమంత్రి చాంపియన్‌షిప్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నీ సోమవారం ప్రారంభమైంది. జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ చంద్ర నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై టోర్నీని ప్రారంభించారు. ఈ నెల 15వ తేదీ వరకు పోటీలు కొనసాగుతాయన్నారు. మొదటి మ్యాచ్‌లో మా మజ్జిగౌరి ఫుట్‌బాల్ క్లబ్ జట్టు, బైరాగి హలువ ఫుట్‌బాల్ క్లబ్ జట్ల మధ్య జరిగింది. మా మజ్జిగౌరి జట్టు 3–0 గోల్స్‌తో విజయం సాధించింది. జిల్లా క్రీడాశాఖ అధికారి షేక్ ఆలీనూర్, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, తదితరులు పాల్గొన్నారు.
ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం
ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం
ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం


