సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
శ్రీ మందిరం ఆదాయం
నగదు : రూ. 5,99,529
బంగారం : 500 మిల్లీ గ్రాములు
వెండి : 28 గ్రాముల 700 మిల్లీ గ్రాములు
– భువనేశ్వర్/పూరీ
రాయగడ:
వేషధారణలో
చిన్నారి
ఉత్కళ భూమి రాముడి సేవలో తరించింది. వేషాలు కట్టి కొన్ని చోట్ల, వివాహ క్రతువు జరిపి మరికొన్ని చోట్ల, శోభాయాత్రలు నిర్వహించి ఇంకొన్ని చోట్ల రామనవమి వేడుకలు నిర్వహించారు. సీతారాముల కల్యాణాలను వైభవంగా చేసి
తరించారు. అధికారులు, నాయకులు, సామాన్యులు అన్న తేడా లేకుండా అందరూ న వమి నాడు రాముడిని సేవించారు.
శ్రీరాముడి వేషంలో విద్యార్థి
కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో శ్రీరామ నవమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. కొరాపుట్ జిల్లా కేంద్రం లోని శబరి శ్రీ క్షేత్ర జగన్నాథ దేవాలయంలో సీతారామ లక్ష్మణ అవతారంలో దేవ దేవులు దర్శనం ఇచ్చారు. నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో లు తమ నియోజకవర్గాలలో పర్యటించారు.
రాయగడలో..
రాయగడ: శ్రీరామ నవమి సందర్భంగా స్థానిక భజరంగ్‌దళ్ కార్యకర్తలు, హిందూ సంస్థలు ఆదివారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. స్థానిక జగన్నాథ మందిరం నుంచి ఒక బృందం, పీహెచ్‌డీ నుంచి మరో బృందానికి చెందిన యువకులు ర్యాలీలో పాల్గొన్నారు. హనుమంతుల వారి గదలను పట్టుకుని ర్యాలీ చేశారు. స్థానికంగా గల కోదండ రామాలయంలో విశేష పూజలను నిర్వహించారు. అదేవిధంగా బాలాజీ నగర్‌లో గల కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి.
జయపురంలో..
జయపురం: జయపురంలో శ్రీరామ నవమి ఉత్సవాలతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక జమాల్ లైన్‌లో శ్రీరామ మందిర కమిటీ వారు, హిందూ సమాజ్ వారు, రఘునాథ్ మందిర పూజాకమిటీలు అంగరంగ వైభవంగా పూజలు ప్రారంభించారు. ఉదయం జమాల్ లైన్ రామ మందిర కమిటీ శ్రీరామ దంపతుల ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించగా శ్రీరామ మందిరం వద్ద భక్తులు దీపారాధనలు చేశారు. శ్రీరాముని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
సరస్వతి శిశు మందిర్‌లో..
మల్కన్‌గిరి: స్థానిక సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో ఆదివారం రామనవమి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల అధ్యక్షుడు రవీంద్ర కుమార్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా గోలక్ చంద్ర దళయి పాల్గొన్నారు. రామాయణ విశిష్టతను పిల్లలకు వివరించారు.
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025


