బీజేపీతోనే దేశాభివృద్ధి
● ఆవిర్భావ కార్యక్రమంలో నాయకులు
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నాయకులు అన్నారు. జాతీయవాదం బీజేపీ భావజాలమన్నారు. బీజేపీ 46వ వార్షికోత్సవాన్ని ఆదివారం జరుపుకోవడం ఆనందాయకమని రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యాలయం ప్రాంగణంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, ప్రధాన కార్యదర్శి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలకు పూలమాలలు వేసి రాష్ట్ర శాఖ ప్రముఖులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
1980 దశకంలో దేశంలో రాజకీయ అస్థిరత నెలకొన్నప్పుడు, భారతీయ జనసంఘ్ సూత్రాలు, ఆదర్శాలు, భావజాలం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ త్యాగం, లక్ష్యం ఆధారంగా జాతీయ స్థాయిలో రాజకీయ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని ప్రారంభించినట్టు నాయకులు పేర్కొన్నారు. పార్టీ అంచెలంచెలుగా ఎలా ఎదిగో నాయకులు వివరించారు. స్థానిక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి విజయ్‌పాల్ సింగ్ తోమర్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మానస్ మహంతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిరంచి నారాయణ్ త్రిపాఠి, రాజ్యసభ సభ్యుడు సుజిత్ కుమార్, లోక్‌సభ సభ్యుడు బలభద్ర మాఝి, భువనేశ్వర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ మిశ్రా పాల్గొన్నారు.
ఘనంగా బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం
కొరాపుట్: భారతీయ జనతా పార్టీ 46వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి బీజేపీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ప్రతి కార్యకర్త తమ ఇంటి మీద పార్టీని జెండాను ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలు ఎమ్మెల్యేకు పార్టీ జెండాలతో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రాథమిక విద్య, సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి నిత్యానంద గొండో తన స్వంత నియోజకవర్గమైన ఉమ్మర్‌కోట్‌లోని పార్టీ కార్యాలయంలో జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీలో చేశారు.
బీజేపీతోనే దేశాభివృద్ధి
బీజేపీతోనే దేశాభివృద్ధి


