
బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
● ప్రారంభమైన మజ్జిగౌరి వార్షిక ఉత్సవాలు
● సునాబేసొలో అమ్మవారి దర్శనం
వైభవం..
చైత్రోత్సవం
రాయగడ: మజ్జిగౌరి అమ్మవారి వార్షిక చైత్రోత్సవాలు మంగళవారం నుంచి ప్రాంభమయ్యాయి. స్థానిక జంఝావతి నది నుంచి ఆలయ కమిటీ అధ్యక్షుడు రాయిసింగి బిడిక, సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, పెద్దిన వాసు, వడ్డాది శ్రీనివాస్‌రావుల దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించి, తీసుకొచ్చిన శుద్ధ జలాలను మందిరంలో ఉంచడంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాంప్రదాయబద్ధంగా ఉదయం సూర్య ఆవాహన పూజలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గంజాం జిల్లా కవిసూర్యనగర్ నుంచి వచ్చిన ప్రత్యేక పూజారుల బృందం ఆధ్వర్యంలో ఐదు రోజులు పాటు పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి.
సునాబేసోలో అమ్మవారు
చైత్రోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారిని బంగారు ఆభరణాలతో అలంకరించారు. దీనినే సునాబేసో అంటారు. సోమవారం అర్థరాత్రి ఈ అలంకరణ కార్యక్రమాలను ఆలయ ప్రధాన పూజారులు చంద్రశేఖర్ బెరుకొ, బబులా బెరుకొలు నిర్వహించడంతో మంగళవారం నుంచి అమ్మవారు సునేబేసోలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల ఐదు రోజులూ అమ్మవారు సునాబేసోలోనే భక్తులకు దర్శనం ఇస్తారు. మంగళవారం కావడంతో పొరుగు రాష్ట్రాలకు చెందిన ఆంధ్రప్రదేశ్, ఇటు ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్‌కు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి బాలురుతీరారు.
మజ్జిగ వితరణ
ఉత్సవాల సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో నిర్వాహక కమిటీ సభ్యులు ఉచితంగా భోజన సౌకర్యాలతో పాటు మజ్జిగ, ప్రసాదాలు వితరణ చేస్తారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మరమరాలతో తయారు చేసే ప్రసాదాలను సమర్పించడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ. ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా వీటిని మహిళలు సమర్పిస్తారు.
ప్రదీప్ కుమార్ జెనాతో ఓఈఆర్‌సీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి
ఓఈఆర్‌సీ చైర్మన్‌కు గవర్నర్ అభినందనలు
న్యూస్‌రీల్
నేటి నుంచి ఘటాల
ఊరేగింపు
అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలు బుధవారం నుంచి పట్టణంలో ఊరేగిస్తారు. మంగళవారం రాత్రి పూజారులు అమ్మవారి ఉత్సవాలకు సంబంధించిన పాదాలను తీసుకొచ్చి గర్భగుడిలో నిలుపుతారు. అనంతరం వాటిని గర్భగుడి సమీపంలోని వేరే గదిలో భక్తుల సందర్శనం కోసం ఉంచుతారు. అదేవిధంగా అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలను అదే ప్రాంతంలో ఉంచి ప్రత్యేకంగా పూజిస్తారు.

బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025