సుదర్శన్‌ పట్నాయక్‌కు ప్రతిష్టాత్మక అవార్డు | - | Sakshi
Sakshi News home page

సుదర్శన్‌ పట్నాయక్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

Published Sun, Apr 6 2025 1:04 AM | Last Updated on Sun, Apr 6 2025 1:04 AM

సుదర్

సుదర్శన్‌ పట్నాయక్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

భువనేశ్వర్‌: రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ సైకత శిల్పి పద్మశ్రీ సుదర్శన్‌ పట్నాయక్‌ ఈసారి బ్రిటిష్‌ శశాండ్‌ మాస్టర్‌ అవార్డును గెలుచుకున్నారు. యూకేలోని వేమౌత్‌లో జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సైకత కళా ఉత్సవం శాండ్‌ వరల్డ్‌ – 2025లో ఆయన ప్రతిష్టాత్మక ఫ్రెడ్‌ డారింగ్టన్‌ బ్రిటిష్‌ సాండ్‌ మాస్టర్‌ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుని అందుకున్న తొలి భారతీయ సైకత శిల్పిగా నిలవడం విశేషం. ప్రపంచ శాంతి సందేశంతో రూపొందించిన 10 అడుగుల సైకత గణపతి శిల్పానికి ఈ అవార్డు లభించినట్లు తెలిపారు.

బగ్గు సరోజినీ దేవి ఆస్పత్రికి ఎన్‌ఏబీహెచ్‌ గుర్తింపు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లా కేంద్రంలోని బగ్గు సరోజినీ దేవి(బీఎస్‌డీ) ఆస్పత్రికి జాతీయ స్థాయిలో నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌(ఎన్‌ఏబీహెచ్‌) గుర్తింపు దక్కడం ఆనందంగా ఉందని డాక్టర్‌ బగ్గు శ్రీనివాసరావు అన్నారు. ఇది దేశంలో క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (క్యూసీఐ) కింద నమోదైన ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ అని చెప్పారు. ఆస్పత్రిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణ, సౌకర్యాలు, అత్యుత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను గుర్తింపు లభించిందన్నారు. 9 సూపర్‌స్పెషాలిటీ విభాగాలతో పాటు 12 డయాగ్నోస్టిక్స్‌ సేవలకు గుర్తింపు లభించిందన్నారు. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో తొలిసారిగా ఈ గుర్తింపు పొందిన ఏకై క ఆసుపత్రిగా బీఎస్‌డీ అని పేర్కొన్నారు. నిరుపేదలు, సామాన్యులకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలందిస్తున్నట్లు చెప్పారు.

‘ఆపరేషన్‌ కగార్‌ను వ్యతిరేకిద్దాం’

టెక్కలి: అడవులను కొల్లగొట్టి కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టే ఆపరేషన్‌ కగార్‌ను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమొక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.ప్రసాద్‌ కోరారు. శనివారం టెక్కలిలో మాట్లాడుతూ అంబానీ, అదానీ వంటి కార్పొరేట్‌ సంస్థలకు అడవులను కట్టబెట్టేందుకు మోదీ సర్కార్‌ పెద్ద కుట్రలు చేస్తున్నారని గుర్తు చేశారు. మావోయిస్టుల నుంచి అడవుల్ని విముక్తి చేసే పేరుతో పెద్ద కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ.లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను దోచుకునే ప్రయత్నమే ఆపరేషన్‌ కగార్‌ అని అన్నారు. దీని కోసం ఆదివాసీలను, మావోయిస్టులను హతమారుస్తున్నారని ప్రసాద్‌ ఆరోపించారు. ఆపరేషన్‌ కగార్‌ను దేశ వ్యాప్తంగా వ్యతిరేకించాలని కోరారు. అలాగే ఈ నెల 13 ఆదివారం పలాసలో జరగనున్న కామ్రేడ్‌ పైల వాసుదేవరావు వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాశ్‌, జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, జుత్తు వీరాస్వామి, గొరకల బాలకృష్ణ, సార జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

వక్ఫ్‌ బిల్లుపై కాంగ్రెస్‌ నిరసన

శ్రీకాకుళం అర్బన్‌: వక్ఫ్‌ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం యావత్‌ ముస్లిం సమాజానికి వ్యతిరేకమని డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు అన్నారు. ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం శ్రీకాకుళం మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్‌ బిల్లులో ఇతర మతస్థులు సభ్యులుగా ఉంటారని తెలియజేయడం శోచనీయమన్నారు. బీజేపీ ప్రభుత్వం మత స్వేచ్ఛను హరిస్తూ కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతోందని ధ్వజమెత్తారు. ఇది లౌకిక వాద సమాజానికి మంచిది కాదని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెంబూరు మధుసూదనరావు, డీసీ ప్రధాన కార్యదర్శి కేవీఎల్‌ఎస్‌ ఈశ్వరి, సైదుల్లా ఖాన్‌, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు అంబటి దాలినాయుడు, జిల్లా మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు చాన్‌ బాషా, నియోజకవర్గాల నాయకులు ఆబోతుల వెంకటనాయుడు, ఇజ్జురోతు రమణ, బొచ్చ వెంకటరమణ, మామిడి సత్యనారాయణ, కొత్తపల్లి రాంప్రసాద్‌, బాషా బాబు, సూరియా బేగం, చోడవరం లీలావతి, చోడవరం చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

సుదర్శన్‌ పట్నాయక్‌కు  ప్రతిష్టాత్మక అవార్డు 1
1/3

సుదర్శన్‌ పట్నాయక్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

సుదర్శన్‌ పట్నాయక్‌కు  ప్రతిష్టాత్మక అవార్డు 2
2/3

సుదర్శన్‌ పట్నాయక్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

సుదర్శన్‌ పట్నాయక్‌కు  ప్రతిష్టాత్మక అవార్డు 3
3/3

సుదర్శన్‌ పట్నాయక్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement