
విక్రమ వర్సిటీని సందర్శించిన విద్యాశాఖ కార్యదర్శి
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వ విద్యాలయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా విభాగ కార్యదర్శి అరవింద అగర్వాల్ గురువారం సాయంత్రం సందర్శించారు. వైస్ చాన్స్‌లర్, రిజిస్టార్, అధ్యాపకులు జిల్లా కలక్టర్ మొదలగు వారితో రెండేళ్ల కిందట ప్రారంభించబడిన విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో సౌకర్యాలు, సమస్యలపై చర్చించారు. కొరాపుట్ జిల్లాలో ఉన్నత విద్య వికాశ లక్ష్యంతో విక్రమదేవ్ కళాశాలను విశ్వవిద్యాలయంగా గుర్తింపు ఇచ్చి ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అయితే నేటికీ కళాశాల భవనాల్లోనే కళాశాల అధ్యాపకుల చేతనే వర్సిటీని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్, కులపతి ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ మిశ్ర, రిజిస్టార్ మహేశ్వర చంద్ర నాయిక్, ఉన్నత విద్యాపరిషత్ డిప్యూటీ డైరెక్టర్ గోపాల్ హల్దార్, విక్రమదేవ్, ఉన్నత విద్యాలయ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ పాత్రో, మహేశ్వర దురియ, డాక్టర్ అరుణ కుమార్ రాజ్, డాక్టర్ విజయ కుమార్ సెట్టి, లంభోదర మఝి, కమల లోచన మహలిక, ప్రాన్సిస్ బర్ల, డాక్టర్ సాగరికమిశ్ర, డాక్టర్ దేవదత్త ఇందోరియ పాల్గొన్నారు.