
రుకుణ రథయాత్ర
నేత్రపర్వంగా..
● మౌసీ మా ఇంటికి లింగరాజు
మహా ప్రభువు
● తరలివచ్చిన భక్తజనం
● పక్కాగా భద్రతా ఏర్పాట్లు
గణనీయంగా దిగజారింది. ఏటా మాదిరిగా యాత్ర ముందు రోజు శుక్రవారం రాత్రి నిర్వహించిన వేలంలో పవిత్ర మారీచి జల కలశం ధర రూ.21,000లు పలికింది. రుకుణ రథ ప్రతిష్ట ఆచారాల తర్వాత శ్రీలింగరాజ ఆలయ సేవకుల బృందం బొడు నియోగులు ఈ వేలం పాటను నిర్వహించారు.
భువనేశ్వర్: పవిత్ర అశోకాష్టమి ఉత్సవంలో అంతర్భాగమైన రుకుణ రథయాత్ర శనివారం వైభవంగా ప్రారంభమైంది. దుర్గాదేవి, గోవింద స్వామితో కలిసి లింగరాజు మహా ప్రభువు మౌిసీ మా (పిన్నమ్మ) దగ్గరకు ప్రయాణమయ్యాడు. దీనిలో భాగంగా రామేశ్వర ఆలయంలో కొలువుదీరి పూజాదులు అందుకోవడం ఆచారం. శనివారం ఉదయం 5 గంటలకు మంగళ హారతి, ప్రాతఃకాల ఆచారాలతో ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఉదయం 5.30 గంటలకు భక్తులకు సర్వ దర్శనం కల్పించారు. మూల విరాటుకు మహా స్నానం ముగించి అలంకరణ ఇత్యాది కార్యక్రమాలను ఉదయం 6.30 గంటల నుంచి 8 గంటల వరకు చేపట్టారు.
పటిష్టమైన భద్రత
రథయాత్ర సజావుగా సాగేందుకు కమిషనరేట్ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతపై నిఘా కోసం సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసు అధికారులతో కూడిన పదహారు ప్లాటూన్ల పోలీసులను మోహరించారు. సమగ్ర భద్రతా కార్యకలాపాల్లో ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు (డీసీపీలు), ముగ్గురు అదనపు డీసీపీలు, 5 మంది సహాయ కమిషనర్లు (ఏసీపీలు), 12 మంది ఇన్‌స్పెక్టర్లు, 65 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లను నియమించారు. నగర డీసీపీ జగన్మోహన్ మీనా, ట్రాఫిక్ డీసీపీ తపన్ మహంతి భద్రత మరియు ట్రాఫిక్ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
మారీచి జలానికి తగ్గిన గిరాఖీ
రుకుణ రథయాత్రలో మారీచి కుండం జలం ప్రత్యేకమైనది. సంతాన ప్రాప్తికి ఈ జలం అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుందని భక్తుల విశ్వాసం. ఏటా రుకుణ రథయాత్ర ముందు రోజు రాత్రిపూట ఈ జలాన్ని వేలం వేస్తారు. భక్తులు ఎగబాకి ఈ జలం కొనుగోలు చేసుకుంటారు. సంతాన ప్రాప్తి కోసం మారీచి కుండం జలం భగవంతుని ప్రసాదంగా భావిస్తారు. అయితే ఈ ఏడాది ఈ జలానికి గిరాఖీ

రుకుణ రథయాత్ర