
నీలకంఠేశ్వర ఆలయంలో సామూహిక ఉపనయనం
భువనేశ్వర్: స్థానిక శ్రీ నీలకంఠేశ్వర్ ఆలయ ప్రాంగణంలో సామూహిక ఉపనయనం నిర్వహించారు. వేద పారాయణంతో ప్రారంభించి, చతుర్విధ కర్మలు, బిక్ష స్వీకరణ వంటి సంప్రదాయ ఆచార వ్యవహారాలతో ఉపనయనం సామూహికంగా నిర్వహించారు. అనంతరం బ్రహ్మచారి సన్యాసులు ఊరేగింపుగా వెళ్లి లింగరాజుని దర్శనం చేసుకున్నారు. గత 14 ఏళ్లుగా నిరవధికంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది భువనేశ్వర్, పరిసర ప్రాంతాలతో పాటు కటక్, జాజ్‌పూర్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి మొత్తం 16 మంది బ్రాహ్మణ పిల్లలు సామూహిక ఉపనయనంలో పాల్గొన్నారు.

నీలకంఠేశ్వర ఆలయంలో సామూహిక ఉపనయనం