భ్రూణ హత్యలు నివారించాలి | - | Sakshi
Sakshi News home page

భ్రూణ హత్యలు నివారించాలి

Apr 5 2025 12:59 AM | Updated on Apr 5 2025 12:59 AM

జయపురం: సమాజంలో భ్రూణ హత్యలు నివారించాల్సిన అవసరం ఉందని స్వచ్ఛంద సేవకురాలు ప్రియదాస్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమాన్ని హెచ్‌ఎం అభిషేక్‌ కుమార్‌ భుయె అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియదాస్‌ మాట్లాడుతూ.. సమాజంలో ఆడపిల్లలు అంటే చిన్నచూపు పోవాలంటే ముందుగా అందరిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యనభ్యసించి, ఉత్తమంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. పురుషాధిక్య సమాజంలో బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, అత్యాచారాలపై విద్యార్థులు నాటికను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు అన్నపూర్ణ సుందరరాయ్‌, సంజుక్త మహరాణ, స్వర్ణలత మిశ్ర, సబితా కుమారి పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

భ్రూణ హత్యలు నివారించాలి1
1/1

భ్రూణ హత్యలు నివారించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement