
50 ఇళ్లలో అంధకారం
జయపురం: పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కమల పూజారి ఇంటితో పాటు మరో 50 ఇళ్లు అంధకారమయ్యాయి. ఆయా ఇళ్ల వారు బిల్లులు కట్టలేదని విద్యుత్ సరఫరా నిలుపు చేశారు. దీంతో ఈ నిరుపేద ఆదివాసీలు అంధకారంలో ఉంటున్నారు. కమల పూజారి గ్రామం జయపురం సమితి పాత్రోపుట్. మూడేళ్ల కిందట ఆ గ్రామంలోను పక్కన ఉన్న కొంజాయి మాలిగుడ గ్రామాల్లో రాజీవ్ గాంధీ విద్యుద్దీకరణ పథకం అమలు చేశారు. ఆ మేరకు పాత్రొపుట్‌లో 50 ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఆ నాడు ఒక బల్బుకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు వేలకు వేలు బిల్లులు రావడంతో గిరిజనులు కంగారు పడుతున్నారు. తాము అంత డబ్బు కట్టలేమని చెప్పినా వినకుండా విద్యుత్‌శాఖాధికారులు కరెంటు సరఫరా నిలిపివేశారు. ఈ ఇల్లలో పద్మశ్రీ డాక్టర్ కమలా పూజారి కుటుంబానికి చెందిన ఇల్లు కూడా ఉంది. అలాగే కొజాయిమాలిగుడలో 12 ఇళ్లకు విద్యుత్ సరఫరా కట్ చేశారు. ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ఆనాడు చెప్పిన అధికారు నేడు బిల్లు కట్టలేదంటూ విద్యుత్ సరఫరా నిలిపి వేయటం అన్యాయమని అన్నారు.
ఈ అంశంపౌ బీజేడీ తీవ్రంగా స్పందించింది. వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించక పోతే బీజేడీ ఆందోళనన చేపడుతుందని మాజీ మంత్రి రబినారాయణ నందో హెచ్చరించారు.

50 ఇళ్లలో అంధకారం