భారీగా గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల, చిత్రకొండ పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో 860 కిలోల గంజాయిను పట్టుకున్నారు. కలిమెల సమితి నుంచి అక్రమంగా చిత్రకొండ వైపునకు ట్రక్‌లో తరలిస్తున్న 500 కిలోల గంజాయిని కలిమెల పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. కలిమెల చెక్‌పోస్టు వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఓ ట్రక్ అతివేగంగా రావడంతో దాన్ని ఆపి తనిఖీ చేశారు. గంజాయి కనిపించడంతో బండిలో ఉన్న హరియాణాకు చెందిన రాజ్‌కుమార్(26), సోను సింగ్ (23)లను అరెస్టు చేశారు. కలిమెల ఐఐసీ చంద్రకాంత్ తండ కేసు నమోదు చేశారు. నిందితులను మంగళవారం కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. దొరికిన గంజాయి విలువ రూ.50 లక్షలు ఉంటుందని తెలిపారు. అలాగే చిత్రకొండ సమితి మంత్రీ పూట్ గ్రామం రహదారిలో ఆదివారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అడవిలో కొన్ని బస్తాలు కనిపించాయి. తీసి చూస్తే గంజాయి ఉంది. 360 కిలోల బరువు ఉన్న ఈ గంజాయి విలువ రూ.36 లక్షల వరకు ఉంటుందని చిత్రకొండ ఐఐసి ముకుందో మేళ్క తెలిపారు.
భారీగా గంజాయి పట్టివేత
భారీగా గంజాయి పట్టివేత
భారీగా గంజాయి పట్టివేత


