బ్యాంకు ఉద్యోగి దుర్మరణం
నరసన్నపేట: నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసన్నపేట నాయుడువీధికి చెందిన హరినాథ్‌కుమార్‌నాయుడు (బాబీ)(46) మృతి చెందారు. ఈయన నెల్లూరు జిల్లా ముత్తుకూరు యాక్సిస్ బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తిరుపతిలో నివాసం ఉంటున్నారు. మంగళవారం ద్విచక్ర వాహనంపై వెళ్తూ ముత్తుకూరు మండలం కొప్పల దొరువు సమీపంలో కుక్క అడ్డంగా రావడంతో అదుపుతప్పి పడిపోయారు. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు వెంట నే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బుధవా రం వేకువజామున చికి త్స పొందుతూ మృతిచెందారు. దీంతో నా యుడువీధిలో విషాదం అలముకుంది. మంచి మిత్రుడిని కోల్పోయామని గొద్దు చిట్టిబాబు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.


