
సద్వినియోగం చేసుకోవాలి
రాయగడ: ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండే వయో వృద్ధులను ప్రభుత్వం తీర్థయాత్రలకు తీసుకెళ్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఫరూల్ పట్వారీ సూచించారు. మంగళవారం రాయగడ నుంచి 775 మంది వయోవృద్ధులు అయోధ్య, వారణాసి వంటి పుణ్యక్షేత్రాలకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో స్థానిక రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలును ఆమె పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక, రాయగడ డీఆర్‌ఎం అమితాబ్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి