
విజిలెన్స్‌కు చిక్కిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీ
మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పవిత్రా మోహన్ పాణిగ్రాహి శుక్రవారం రాత్రి విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డారు. తన కారులో చిత్రకొండ నుంచి విధులు ముగించుకొని భువనేశ్వర్ వెళ్తుండగా గోవిందపల్లి వద్ద విజిలెన్స్ పోలీసులు కారు ఆపారు. లోపల తనిఖీలు చేయగా రూ.5లక్షల 7వేలు అక్రమంగా ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కొరాపుట్‌కు తరలించారు. ఇంట్లో సోదాలు చేయగా విలువైన ఆస్తులు, బంగారు గుర్తించారు. అనంతరం కొరాపూట్ విజిలెన్స్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

విజిలెన్స్‌కు చిక్కిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీ