
క్రమశిక్షణతో విద్యనభ్యసించాలి
రాయగడ: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని పద్మపూర్ సమితి భామిని ప్రాంతంలోని ఐఆర్‌బీఎన్ బెటాలియన్ కమాండెంట్ బ్రజమోహన్ నాయక్ అన్నారు. పద్మపూర్‌లోని అభ్యాస్ టెక్నో పాఠశాల వార్షికోత్సవానికి శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యతోనే ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పద్మపూర్ తహసీల్దార్ శంకర్ బాగ్ మాట్లాడుతూ.. విద్యని వ్యాపారంగా కాకుండా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని విద్యా సంస్థలను నిర్వహించాలని సూచించారు. విద్యతో పాటు ఇతర అంశాల్లోనూ రాణించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి లాడి తుకారం, ప్రిన్సిపాల్ దివ్య దేవాశిష్ దుబే తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పాఠశాల వార్షికోత్సవం పురస్కరించుకొని రక్తదానం శిబిరం నిర్వహించారు. శిబిరంలో 51 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.

క్రమశిక్షణతో విద్యనభ్యసించాలి