భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ దేవస్థానం దైనంది న కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న సేవాయ త్ వర్గానికి ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు. స్థానిక నీలాద్రి భక్త నివాస్‌లో 2 రోజుల పాటు కొన సాగనున్న సేవకుల శిక్షణ శిబిరం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ, పూరీ జిల్లా మేజిస్ట్రే ట్, పోలీసు సూపరింటెండెంటు సమక్షంలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవకునికి ఉన్నత లక్షణాలను వివరిస్తు ప్రధాన అంశాల్ని సీఏఓ ప్రస్తావించారు. అన్ని వర్గాల సేవకులకు ఉండాల్సిన 10 ప్రధాన అంశాలను ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణ, సదస్సు ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు కొనసాగుతుంది. ఈ శిబిరంలో వివిధ అంశాలపై చర్చలు ఉంటాయని పేర్కొన్నారు.
సేవాయత్‌ల ఉత్తమ ప్రవర్తనకు శిక్షణ