అడవుల్లో అగ్ని సెగలు | - | Sakshi
Sakshi News home page

అడవుల్లో అగ్ని సెగలు

Apr 11 2025 1:38 AM | Updated on Apr 11 2025 1:38 AM

అడవుల

అడవుల్లో అగ్ని సెగలు

పాత్రోపుట్‌ అడవిలో పోడు వ్యవసాయం కోసం అడవులు తగుబెట్టిన దృశ్యం

జయపురం: జయపురంలో ఎండలు మండుతున్నాయి. జయపురం అటవీ రేంజ్‌లో గత ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు 23 చోట్ల అడవులు అగ్ని ప్రమాదాల్లో చిక్కుకుని తగలబడినట్లు తెలుస్తోంది. ఈ వేసవిలో అగ్ని ప్రమాదాల నుంచి అడవులను కాపాడేందుకు 8 స్వచ్ఛంద సంస్థలకు అటవీ విభాగం బాధ్యతలు అప్పగించింది. అయినా అడవుల్లో అగ్ని ప్రమాదాలు తగ్గటం లేదు. గత ఫిబ్రవరి నెలలో జయపురం అటవీ రేంజ్‌లో 3 ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరుగగా మార్చ్‌ నెలలో 9 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ నెల అనగా ఏప్రిల్‌ 1 వ తేదీన రెండు ప్రాంతాల్లో అడవులు తగుల బడగా, ఏప్రిల్‌ 5 వ తేదీన రెండు ప్రాంతాలలోను, 6న ఒక ప్రాంతంలోను, 7న ఒక ప్రాంతంలోను, 8న 5 ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినట్లు తెలిసింది. మంగళవారం బరిణిపుట్‌ పంచాయతీ మహుళభట రిజర్వ్‌ ఫారెస్టులు రెండు చోట్ల, కొండమాలి రిజర్వ్‌ ఫారెస్టులు రెండు చోట్ల, బులెట్‌ షోరూం వెనుక వైపున ఉన్న అడవిలో అగ్ని ప్రమాదాలు జరిగినట్లు జయపురం అటవీ రేంజర్‌ పొరిడ వెల్లడించారు.

అడవుల్లో అగ్ని సెగలు 1
1/1

అడవుల్లో అగ్ని సెగలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement