
దుస్తులు సాంప్రదాయానికి ప్రతీకలు
జయపురం: మనం ధరించే దుస్తులు సాంప్రదాయానికి ప్రతీకలని సబ్ కలెక్టర్, మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి అక్కవరం శొశ్య రెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ’అమొ పోషక అమొ పరిచయం’ కార్యక్రమం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒడిశా పక్షోత్సవాలు నిర్వహిస్తోందని తెలియజేశారు. ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతుల పరిరక్షణ లక్ష్యంతో పక్షోత్సవాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మనం ధరించే సాంప్రదాయ వస్త్రాలు మన స్వాభిమానమని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ సహాయ కార్య నిర్వాహక అధికారి కతిబాస సాహు తదితరులు పాల్గొన్నారు.