జాదవ మజ్జికి ఘన నివాళి
కొరాపుట్: దివంగత పరిశ్రమల మంత్రి జాదవ మజ్జి 26వ వర్ధంతి ఘనంగా జరిగింది. గురువారం నబరంగ్‌పూర్ జిల్లా చందాహండి సమితి కేంద్రంలో ప్రధాన జంక్షన్ వద్ద జాదవ మజ్జి విగ్రహానికి వందలాది ప్రజలు నివాళులు అర్పించారు. ఇదే సమయంలో చందాహండి ప్రభుత్వ హైస్కూల్‌లో జాదవ మజ్జి విగ్రహానికి నివాళులర్పించారు. జనతా దళ్ పార్టీ నేతృత్వంలో బిజూ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1990–95 మధ్య కాలంలో జాదవ మజ్జి రాష్ట్ర భారీ పరిశ్రమలు, ప్లానింగ్ శాఖ మంత్రి గా పని చేశారు. బిజూకి నమ్మకమైన వ్యక్తులలో జాదవ మజ్జి ఒకరని రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది. కార్యక్రమాల్లో అతని కుమారులు మాజీ మంత్రి, బీజేడి జిల్లా ప్రెసిడెంట్ రమేష్ చంద్ర మజ్జి, మాజీ ఎంఎల్‌ఎ ప్రకాష్ చంద్ర మజ్జి బీజేడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
జాదవ మజ్జికి ఘన నివాళి
జాదవ మజ్జికి ఘన నివాళి


