
‘నాగేశ్వరి గుహల్లో తవ్వకాలు అంగీకరించబోము’
నాగేశ్వరి గుహలలో మాజీ ఎంపీ జయరాం పంగి
కొరాపుట్: గిరిజనుల ఆరాధ్య దైవం ఉన్న నాగే శ్వరి గుహలపై తవ్వకాలు అంగీకరించబోమని కొరాపుట్ మాజీ ఎంపీ జయరాం పంగి ప్రకటించారు. శుక్రవారం కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి బల్దా గ్రామ పంచాయతీ నాగేశ్వరి గుహలను సందర్శించారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాగేశ్వరి గుహలను ఎకో టూరిజం ప్రాజెక్ట్ కింద శంకుస్థాపన చేశారని తెలిపారు. అలాంటి టూరిజం ప్రాజెక్ట్‌ని ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. ఈ గుహలను తవ్వి బాకై ్సట్ తవ్వకాల కోసం అదానీ కంపెనీకి కట్టబెట్టిందని ఆరోపించారు. స్థానిక గిరిజనులు ఈ తవ్వకాలకు పెద్ద ఎత్తున్న వ్యతిరేక పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పంగి ఆరోపించారు.

‘నాగేశ్వరి గుహల్లో తవ్వకాలు అంగీకరించబోము’