
కుందేళ్ల కళేబరాలు గుర్తింపు
రాయగడ: స్థానిక చెక్కాగుడ సమీపంలోని ప్రేమ్ పహాడ్ వద్ద తాజాగా మరో మూడు కుందేళ్ల కళేబరాలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రెండు రోజుల క్రితం 5 కుందేళ్ల కళేబరాలు ఇక్కడ లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటవీ శాఖ సిబ్బంది గురువారం సాయంత్రం గాలింపు చర్యలు చేపట్టడంతో వేర్వేరు ప్రాంతాల్లో మరో మూడు కుందేళ్ల కళేబరాలను గుర్తించారు. దీంతో ఇప్పటివరకు 8 కుందేళ్ల కళేబరాలు లభ్యమయ్యాయి. అయితే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, లేదా ఎవరైనా వీటిని చంపి ఇక్కడ పడేశారా అన్న కోణంలో అటవీ శాఖ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ వన్యప్రాణులకు రక్షణ కరువవుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
కొత్తగా లభ్యమైన కుందేలు కళేబరం