
భక్తిశ్రద్ధలతో ఈస్టర్ సండే
సోమవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
సోనియా, రాహుల్‌లపై
బీజేవైఎం ఆగ్రహం
కొరాపుట్: రాష్ట్ర రాజధానిలో భారతీయ జనతా పార్టీ యువజన మోర్ఛా కార్యకర్తలు ఆదివారం భారీ ఆందోళన చేశారు. భువనేశ్వర్‌లోని మాస్టర్ క్యాంటీన్ చౌక్ వద్ద సోనియా గాంధీ, రాహుల్ గాంధీల చిత్ర పటాలతో నిరసన చేశారు. తక్షణం ఈడీ ముందు హాజరు కావాలన్నారు. వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఖేల్ ఇండియా సెంటర్లు ప్రారంభం
కొరాపుట్: రాష్ట్ర వ్యాప్తంగా ఖేల్ ఇండియా సెంటర్స్‌ని రాష్ట్ర ఉన్నత విద్య, స్పోర్ట్స్, యూత్ సర్వీసెస్ మంత్రి సూరజ్ సూర్యవంశీ ప్రారంభించారు. ఆదివారం భువనేశ్వర్‌లోని తన కార్యాలయంలో వర్చువల్ విధానంలో ఈ కేంద్రాలను ప్రారంభించారు. తొలి విడతగా ప్రతి జిల్లాకు ఇదే వేదిక మీద రు.5 లక్షలు చొప్పున విడుదల చేశారు.
లక్ష్మీపూర్‌లో సైబర్ మోసం
కొరాపుట్: ప్రభుత్వ ఉపాధ్యాయుడు సైబర్ మోసానికి గురయ్యారు. లక్ష్మీపూర్ సమితి కార్యాలయ సమీపంలో నివాసముంటున్న టీచర్ త్రినాథ్ మహాపాత్రోకి ఆదివారం ఓ ఫోన్‌కాల్ వచ్చింది. హెడీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని, డెబిట్ కార్డుకి లింక్ పంపుతున్నామని, ఓటీపీ చెప్పాలని కోరారు. బాధితుడు ఓటీపీ చెప్పిన వెంటనే క్షణాల్లో రూ.19,600 అతని అకౌంట్ నుంచి కట్ అయ్యాయి. తాను మోసపోయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జయపురంలో ఆదివారం ఈస్టర్ సండే ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 5 గంటలకు వందలాది మంది పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. క్రీస్తు పునరుత్థానాన్ని తెలిపే కరపత్రాలు పంచారు. సమాధులపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. – జయపురం
పర్లాకిమిడి: అంతర్జాతీయ సహకార సంఘాల సంవత్సరం పురస్కరించుకొని కలెక్టరేట్ వద్ద ఒక చైతన్య రథాన్ని జిల్లా పాలనాధికారి బిజయ కుమార్ దాస్ పచ్చజెండా ఊపి ఆదివారం ప్రారంభించారు. సహకార సంఘాలు ఏర్పాటు వల్ల రైతులకు రుణాలు మంజూరు చేయడానికి జిల్లాలో ఉన్న 50 ప్యాక్స్, ల్యాంప్స్‌లు 100కి పెరిగాయని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ప్యాక్స్ (ప్రాథమిక పరపతి సంఘం) ద్వారా రూ.5 లక్షల రుణం ప్రభుత్వం అందజేస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కో–ఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రార్ హరిహర శెఠి తదితరులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్

భక్తిశ్రద్ధలతో ఈస్టర్ సండే

భక్తిశ్రద్ధలతో ఈస్టర్ సండే

భక్తిశ్రద్ధలతో ఈస్టర్ సండే

భక్తిశ్రద్ధలతో ఈస్టర్ సండే

భక్తిశ్రద్ధలతో ఈస్టర్ సండే

భక్తిశ్రద్ధలతో ఈస్టర్ సండే

భక్తిశ్రద్ధలతో ఈస్టర్ సండే