మావోల డంప్ స్వాధీనం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి పిలిమామ్మిడి గ్రామ అడవిలో శుక్రవారం రాత్రి నుంచి రెండో బెటాలియాన్ బీఎస్‌ఎఫ్ జవాన్ల్ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. శనివారం తిరిగి వస్తున్న సమయంలో ఓ కొండపై రాయి మధ్యన ఓ నల్లని క్యారీ బ్యాగ్‌లో జవాన్లను టార్గెట్ చేస్తూ ఉంచి మావోల సామగ్రి జవాన్ల కంట పడింది. అందులో రెండు బర్మన్ తుపాకులు, గన్ పౌడర్ తదితర వస్తువులు గుర్తించారు.
చోరీ సొత్తు స్వాధీనం
కొరాపుట్: ఒక చోరీ కేసులో సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సిమిలిగుడ పోలీసులు ప్రకటించారు. శనివారం సిమిలిగుడ ఇన్‌చార్జి ఐఐసీ అనితా కుజుర్ కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 14వ తేదీ సాయంత్రం సిమిలిగుడ పోలీసుస్టేషన్ పరిధి కై లాష్ నగర్ 10వ లైన్‌లో నివసిస్తున్న ప్రబీర్ కుమార్ దాస్ ఒక శుభకార్యానికి సునాబెడా వెళ్లారు. అయితే రాత్రి తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడినట్లు గమనించారు. వెంటనే పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో జయపూర్ సదర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోరీకి గురైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో రూ.22,500ల నగదు, వెండి వస్తువులు, స్టేషనరీ సామాన్లు ఉన్నాయని ప్రకటించారు.
300 కేజీల గంజాయి స్వాధీనం
కొరాపుట్: అక్రమంగా రవాణా చేస్తున్న 300 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కొరాపుట్ జిల్లా నందపూర్ పోలీసులకు గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు శనివారం సమాచారం వచ్చింది. దీంతో పెట్రోలింగ్ చేపట్టారు. దీనిలో భాగంగా హికింపుట్ గ్రామం వద్ద నిలుపుదల చేసిన ఒక కారుని పరిశీలించారు. అందులో భారీగా గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. కారు యజమాని కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కారు పాడువా నుంచి సిమిలిగుడ వైపు వస్తున్నట్లు పేర్కొన్నారు.
విజిలెన్స్ వలలో అడిషనల్ తహసీల్దార్
కొరాపుట్: విజిలెన్స్ వలలో అడిషనల్ తహసీల్దార్ పడ్డా. శని వారం సంబల్‌పూర్ జిల్లా మానేశ్వర్ తహసీల్ కార్యాలయంలో అదనపు తహసిల్దార్‌గా పనిచేస్తున్న భుభనానంద సాహు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. వ్యవసాయ భూమిని గృహ నిర్మాణ భూమిగా మార్చడానికి రూ.10వేలు లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు విజిలెన్స్ వారిని సంప్రదించగా వారు మాటు వేసి పట్టుకున్నారు.
గ్రామస్తుల చేతికి చిక్కిన దొంగ
కొరాపుట్: దొంగతనం చేయడానికి వెళ్లి గ్రామస్తుల చేతికి చిక్కిన ఓ దొంగ దొరికిపోయాడు. శనివారం వేకువ జామున కొరాపుట్ జిల్లా కేంద్రానికి సమీపంలో మస్తీపుట్ గ్రామ పంచాయితీ రుండియా గ్రామంలోనికి ముగ్గురు దొంగలు ప్రవేశించారు. ఒక దుకాణంలో దొంగతనం చేస్తున్నారు. ఇదే సమయంలో గ్రామ యువకులు కొరాపుట్ పట్టణం నుంచి తిరిగి వచ్చారు. దొంగలు పడినట్లు గుర్తించి వారిపై దాడి చేశారు. ఇద్దరు పారిపోగా.. ఒకడిని పోలీసులకు అప్పగించారు.
స్వాధీనం చేసుకున్న తుపాకులతో కలిమెల పోలీస్ స్టేషన్ వద్ద జవాన్లు
మావోల డంప్ స్వాధీనం
మావోల డంప్ స్వాధీనం
మావోల డంప్ స్వాధీనం


