
సీఎంతో సుదర్శన్ పట్నాయక్ భేటీ
కొరాపుట్: సీఎం మోహన్ చరణ్ మఝితో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ భేటీ అయ్యారు. ఇటీవల యునైటెడ్ కింగ్‌డమ్‌లో జరిగిన పోటీల్లో సుదర్శన్‌కి శాండ్ మాస్టర్ అవార్డు లభించింది. అవార్డుతో ఇండియా వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిని కలిశారు. సుదర్శన్‌ను సీఎం శాలువ కప్పి సత్కరించారు.
సీఎంతో స్పెయిన్
అంబాసిడర్ చర్చలు
కొరాపుట్: రాష్ట్ర ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మఝితో స్పెయిన్ అంబాసిడర్ జువాన్ ఆంటోనియో మార్చ్ పౌజల్ చర్చలు జరిపారు. లోక్ సేవా భవన్‌లో ఆయన సీఎంను కలిశారు. స్పె యిన్–ఇండియా సంబంధాలపై మాట్లాడారు.
ఈడీ ఆఫీసు ముందు ఆందోళన
కొరాపుట్: భువనేశ్వర్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫీస్ ముందు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. తమ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేంద్రం కక్ష కట్టి అక్రమ కేసులు మోపుతోందని అన్నారు. ఈ వేధింపులు ఆపాలని నినాదాలు చేశారు. ఈ ఆందోళనకు జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహీణీపతి హాజరయ్యారు.

సీఎంతో సుదర్శన్ పట్నాయక్ భేటీ

సీఎంతో సుదర్శన్ పట్నాయక్ భేటీ