
ప్రేమ్ పహాడ్ వద్ద కుందేళ్ల కళేబరాలు
రాయగడ: స్థానిక చెక్కాగుడ సమీపంలో గల ప్రేమ్‌పహాడ్ వద్ద 5 కుందేళ్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒకే చోట కుందేళ్ల మృతదేహాలు పడి ఉండటం పై పలువురు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రొజు ప్రేమ్ పహాడ్ వద్దకు వచ్చి వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఇంత వరకు ఈ ప్రాంతంలో ఒక్క కుందేలును కూడా తాము చూడలేదని వాకర్స్ క్లబ్ సభ్యులు శంకర్షన్ మంగరాజ్ చెప్పారు. ఇదే విషయమై ఫారెస్ట్ రేంజర్ కామేశ్వర్ ఆచారి దృష్టికి తీసుకువెళ్లగా ప్రేమ్ పహాడ్ వద్ద కుందేళ్ల సంచారం చేసే విషయం ఎప్పుడూ తమ దృష్టికి రాలేదని అన్నారు. అయితే ఒకే ప్రాంతంలో కుందేళ్ల మృతదేహాలు పడి ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై దర్యాప్తు ప్రారంభిస్తామని అన్నారు