
ట్రక్ యజమానుల ఆందోళన
కొరాపుట్: ట్రక్ యజమానుల ఆందోళనతో పేదల కు పంచాల్సిన పీడీఎస్ బియ్యం రవాణా నిలిచి పో యింది. బుధవారం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కో ట్ పట్టణంలోని పీడీఎస్ గొడౌన్ ముందు ఉమ్మర్‌కోట్ ట్రక్ యజమానుల సంఘం ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. బియ్యం రవాణాను కాంట్రాక్టర్లు చేస్తున్నారన్నారు. తాము రవాణా చేయాల్సిన బియ్యాన్ని పీడీఎస్ కాంట్రాక్టర్లు చేయడం తగదన్నా రు. తమ ట్రక్‌లు అనుమతించే వరకు గేట్లు తెరవనివ్వమన్నారు. దీంతో లోపల ఉన్న కాంట్రక్టర్ల ట్రక్ లు నిలిచిపోవడంతో బియ్యం రవాణా ఆగిపోయింది. ఈ నెలాఖరు నాటికి 40 వేల క్వింటాళ్ల బియ్యం పంచాయతీ కేంద్రాలకు చేరాల్సి ఉండగా.. ఇప్పటి కి కేవలం వెయ్యి క్వింటాళ్ల బియ్యం మాత్రమే రవాణా జరిగింది.