
● హజ్ యాత్రికులకు వీడ్కోలు
కొరాపుట్: హజ్ యాత్రకు వెళ్లే వారికి వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదివారం జయపూర్ పట్టణంలోని సంధ్యా ఫంక్షన్ హాల్ లో ఈ ప్రాంతం నుంచి వెళ్తున్న 11 మంది హజ్ యాత్రికులను పిలిపించి సన్మానం చేశారు.అవిభక్త కొరాపుట్ జిల్లాల నుంచి గతం లో వెళ్లి వచ్చిన హజ్ యాత్రికులు (హజీజ్) లు వచ్చి బహుమతులు అందజేశారు. ఈ నెల 22వ తేదీన అవిభక్త కొరాపుట్ జిల్లాల నుంచి హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరం జరగనుంది.
మే 13 నుంచి విడతల వారీగా హజ్ యాత్రికులు బయల్దేరి వెళ్లనున్నారు. ముస్లిం మత పెద్దలు ఎండీ హజర్ బేగ్, కేఎం ఇషాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ సామూహిక ప్రార్థనలు చేశారు.