
కమ్యూనిస్టు నేత దివాకర్ నాయిక్ మృతి
జయపురం: కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకుడు దివాకర్ నాయిక్ మృతి పార్టీకి తీరని లోటని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కార్మిక నేత ప్రమోద్‌కుమార్ మహంతి అన్నారు. ఆదివారం కార్మిక భవనంలో కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్ జిల్లా పరిషత్ నిర్వహించిన దివాకర్ సంతాప సభలో మహంతి మాట్లాడుతూ దివాకర నాయిక్ శనివారం రాత్రి 11.10 గంటలకు భువనేశ్వర్‌లో మరణించారని తెలిపారు. దివాకర్ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా విశేష సేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి జుధిష్టర్ రౌళో, సహాయక కార్యదర్శి రామకృష్ణ దాస్, పార్టీ నేతలు బసంత బెహరా, జయరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.