
నకిలీ మద్యం కేంద్రంపై దాడులు
కొరాపుట్: నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎకై ్సజ్ పోలీసు అధికారులు దాడి చేశారు. పట్టణంలోని బెడావీధిలో విదేశీ మద్యం తయారవుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఆ ప్రాంతంపై నిఘా పెట్టారు. అనుమానిత ఇంటి నుంచి ఇప్పిలి సంతోష్ అనే వ్యక్తి వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ప్రశ్నించగా భారీ రాకెట్ బయటపడింది. నిందితుడు నకిలీ మద్యం తయారీ విధానం చూసి ఎకై ్సజ్ పోలీసులు ఆశ్చర్యపోయారు. అతని వద్ద నుంచి ప్రముఖ బ్రాండ్స్ స్టిక్కర్లు, బాటిల్స్ మూతలు, స్పిరిట్, వివిధ రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎకై ్సజ్ కార్యాలయంలో మీడియా నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. ఖరీదైన బ్రాండ్ల మద్యాన్ని మీడియా ముందు తయారు చేసి నిందితుడు చూపించాడు. ఇన్‌స్పెక్టర్ శశికాంత్ దత్త మాట్లాడుతూ నిందితుడు చాలాకాలంగా ఇలా మద్యం తయారు చేసి, అనేక ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడన్నారు. ఈ కేసులో మరికొందరు హస్తం ఉందని, వారిని కూడా అరెస్ట్ చేస్తామని ప్రకటించారు.

నకిలీ మద్యం కేంద్రంపై దాడులు