
ప్రకృతి వ్యవసాయంతో నేలకు మేలు
పాతపట్నం: ప్రకృతి సాగుతో అటు నేలకు, ఇటు పంటకు ఎంతో మేలు జరుగుతుందని తద్వారా రైతుకు ఆదాయం సమకూరుతుందని ప్రకృతి వ్యవసాయం అడిషనల్ డీపీఎం ధనుంజయ అన్నారు. మండలంలోని మెట్టుపేట గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో కలిసి సహజ సిద్ధ ఆహారంపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి నుంచి పండించే బెల్లం, వేరు శనగ, కొర్రెలు, కారం, రాగులు, చింతపండు వంటి పదార్థాలు తీసుకోవడం వద్ద కలిగే ప్రయోజనాలు తెలియజేశారు. ప్రకృతి వ్యవసా యం చేస్తూ మంచి ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవాలని రైతులకు, మహిళా సంఘాలకు వివరించారు. కార్యక్రమంలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ రేణుక, గోవిందరెడ్డి, శివాజీ, సువర్ణరావు, శ్రావ్య, భారతి, రైతులు పాల్గొన్నారు.