విప్పపువ్వు అక్రమ రవాణా
రాయగడ: బియ్యం బస్తాల మాటున విప్పపువ్వును అక్రమంగా తరలిస్తున్న ఒక పికప్ వ్యాన్‌ను ఎకై ్సజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ డ్రైవర్ చంద్రగొరడను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఎకై ్సజ్ శాఖ ఓఐసీ సంజయ్ కుమార్ ప్రధాన్ తెలిపిన వివరాల మేరకు.. నాటుసారా తయారీకి వినియోగించే విప్పపువ్వు అక్రమంగా తరలిస్తున్నారని అందిన సమాచారం మేరకు స్థానిక మజ్జిగౌరి మందిరం వద్ద సోమవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రాయగడ మీదుగా శశిఖాల్ వైపు వెళ్తున్న ఒక పికప్ వ్యాన్‌ను ఆపి తనిఖీ చేశారు. దీంతో అందులో 600 క్వింటాళ్ల బియ్యం బస్తాలు కనిపించాయి. అయితే అధికారులు లోతుగా తనిఖీ చేయగా బియ్యం బస్తాల కింద 900 క్వింటాళ్ల విప్పపువ్వు బస్తాలు బయటపడ్డాయి. అదేవిధంగా తనిఖీల్లో భాగంగా మందిరం చెక్‌గేట్ వద్ద నాటుసారా తరలిస్తున్న కె.అనిల్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 7 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎ.అప్పలరాజు అనే వ్యక్తి విదేశీ మద్యం తరలిస్తుండగా పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 7 లీటర్ల విదేశీ మద్యం స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.


