నూతన భవనం ప్రారంభం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్రంలో మ్యూజియం సమీపంలో ఉన్న కౌన్సిల్ ఆఫ్ ఎనాలిటికల్ ట్రైబల్ స్టడీస్ (కోట్స్) ప్రాంగణంలో నూతన భవనాన్ని కొరాపుట్ కలెక్టర్ వి.కీర్తి వాసన్ ప్రారంభించారు. ఓఎంసీ కేటాయించిన రూ..8 లక్షలతో ఈ భవనం నిర్మితమైంది.
రోడ్డు ప్రమాదంలో
యువకుడు మృతి
కొరాపుట్: కొరాపుట్ జిల్లా దశమంత్‌పూర్ సమితి డెంగాగుడ–కలిమా గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో చికాంబర్ గ్రామానికి చెందిన ధర్మేంధ ముదలి (25) అనే యువకుడు మృతి చెందాడు. స్నేహితుడి ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ, మలుపు దాటుతుండగా బైక్ అదుపు తప్పింది. దీంతో పక్కనే ఉన్నటువంటి గోతులోకి బైక్ దూసుకుపోవడంతో రాళ్లని ఢీకొని మృతి చెందాడు. దశమంత్‌పూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
రాయగడలో చోరీ
రాయగడ: పట్టణంలోని కరణం వీధిలో నివసిస్తున్న కె.సుభాష్ చంద్కర బెహర అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లో చొరబడి బీరువా విరగ్గొట్టి రూ.2.50 లక్షల నగదును దోచుకెళ్లినట్లు బాధితుడు సదరు పోలీసుస్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి ఇంట్లోని అందరూ నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో సుభాష్‌కు మెలకువ వచ్చి వాష్ రూమ్‌కి వెళ్లేందుకు చూశాడు. అయితే అప్పటికే ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అనంతరం ఇంట్లోని ఒక గదిలో ఉన్న బీరువా తలుపులు తెరిచి ఉండడం గమనించి అక్కడికి వెళ్లి చూడగా అందులోని నగదు కనిపించలేదు. దీంతో తెల్లవారుజామున పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నూతన భవనం ప్రారంభం


