
ఉద్యోగ భద్రత కల్పించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని కలెక్టరేట్ వద్ద ఉన్న పూలే పార్కు వద్ద శనివారం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు జీతాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.ఉషారాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇందుమతి, జిల్లా కో–ఆర్డినేటర్ సీహెచ్ రాజీవ్, జి.రాఘవ తదితరులు పాల్గొన్నారు.
పెన్షనర్లపై కుట్ర
శ్రీకాకుళం: ఓవైపు పాత పెన్షన్ అమలు కోసం ఉద్యోగులు కలిసికట్టుగా పోరాటం చేస్తుంటే ఇవేవీ పట్టని కేంద్ర ప్రభుత్వం పాత ఫించన్‌దారులకు హానికలిగించేలా పెన్షన్ సవరణ బిల్లు తీసుకురావడం దారుణమని ఎన్డీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్ ఆర్ దాసరి క్రాంతి భవన్ వద్ద లోక్‌సభలో పెన్షన్ సవరణ బిల్లు ఆమోదంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్డీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.రామకష్ణ, చింతల రామారావు, శ్రీనివాసరావు, తిరుమలరావు, జి.శ్రీనివాసరావు, హెచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎస్.వి.రమణమూర్తి