రైళ్ల రాకపోకలకు అంతరాయం
కొరాపుట్:
కొత్తవలస – కిరండోల్ రైల్వేమార్గంలో మరోసారి రైళ్ల రాకపొకలకు అంతరాయం ఏర్పడింది. జగదల్‌పూర్ – జయపూర్ స్టేషన్ల మధ్య కొడప రైల్వేస్టేషన్ సమీపంలో విద్యుత్ వైర్లపై చెట్లు పడిపోయాయి. దీంతో ఆ మార్గంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా జగదల్‌పూర్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌ని కుసిమి వద్ద నిలిపివేశారు. సహాయక చర్యల అనంతరం మరలా రైళ్లని పునరుద్ధరించారు. సుమారు 3 గంటల పాటు రైలు ఆలస్యం కావడంతో జయపూర్, కొరాపుట్ రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు పడిగాపులు కాశారు. గత నాలుగు రోజుల్లో కొరాపుట్, రాయగడ జిల్లాల్లో వరుసగా 3 సార్లు ఇదే సమస్యలతో రైళ్లు నిలిచిపోయాయి.
రైళ్ల రాకపోకలకు అంతరాయం


