
జడలు విప్పిన మూఢ విశ్వాసం
కొరాపుట్: మత మూఢ విశ్వాసం జడలు విప్పడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నబరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి కుమిలి గ్రామ పంచాయతీ మాల్బెడ గ్రామానికి చెందిన శ్రావణ్ గొండో (30) మహారాష్ట్రలో జరిగిన ఓ ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. అయితే ఇటీవల శ్రావణ్ మతం మార్చుకున్నాడు. అంత్యక్రియలు కోసం గ్రామ శ్మశానికి తీసుకెళ్లగా గిరిజనులు అడ్డుకున్నారు. తమ మతం కాని వ్యక్తిని ఇక్కడ సమాధి చేయడానికి వీల్లేదని, అతని మతానికి చెందిన శ్మశానం ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లాలని సూచించారు. దీంతో మృతుని కుటుంబీకులు శవాన్ని తిరిగి ఇంటికి తీసుకొని వచ్చారు. అప్పటికే గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇది తెలిసి రాయగర్ నుంచి పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు. అర్ధరాత్రి వరకు సమస్య కొలిక్కి రాకపోవడంతో మృతుని బంధువులు తమ సొంత భూమిలోనే సమాధి చేశారు. ఇది తెలిసి గ్రామస్తులు మృతుని ఇంటిపై దాడి చేశారు. తిరిగి ఆ మృతదేహాన్ని బయటకు తీసి గ్రామం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆఖరకు మృతదేహాన్ని బయటకు తీయడం కూడా ప్రారంభించారు. ఇది తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతునికి కుటుంబానికి అండగా నిలిచారు. గురువారం రోజంతా గ్రామస్తులతో అధికారులు చర్చలు జరిపారు. సగం తవ్విన సమాధి వద్ద మృతుని కుటుంబీకులు, పోలీసులు మోహరించారు. పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్లటూన్ పోలీసులను అదనంగా గ్రామంలో మోహరించారు.

జడలు విప్పిన మూఢ విశ్వాసం

జడలు విప్పిన మూఢ విశ్వాసం

జడలు విప్పిన మూఢ విశ్వాసం

జడలు విప్పిన మూఢ విశ్వాసం