
కాంగ్రెస్‌లోకి పలువురి చేరిక
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ సమితిలో గల పలువురు బీజేడీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రేస్‌లోకి సోమవారం చేరారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్‌దాస్ సమక్షంలో చేశారు. జిల్లాలోని గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ, పీసీసీ ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్ పండా తదితరుల సమక్షంలో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో పద్మపూర్ సమితి మాజీ చైర్మన్ రమాకాంత్ మాఝి, సర్పంచ్ అగాదు సబర్, జుగల్ మాఝి, రాజేష్ సబర్, డొంబురు నుండ్రుక తదితర ప్రముఖులు ఉన్నారు.
ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు దాస్ వారిని పార్టీ కండువాలను వేసి ఆహ్వానించారు. భవిష్యత్‌లో పార్టీ అభివృద్ధికి కలసి కట్టుగా కృషి చేయాలన్నారు.