వివాదం!
–8లోu
విగ్రహం..
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం
జిల్లాలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై జిల్లా పరిషత్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఘనంగా బెంగాలీ చైత్రమాస వేడుకలు
మల్కన్‌గిరి జిల్లా కేంద్రం మల్కన్‌గిరిలో బుధవారం బెంగాలీ నూతన సంవత్సర వేడుకలు(చైత్రమాస వేడుకలు) ఘనంగా నిర్వహించారు.
వైద్యసౌకర్యాలు మెరుగుపర్చాలి
ఆదివాసీ, హరిజన ప్రాంతమైన రాయగడ జిల్లాలో ప్రజలకు సరైన వైద్య సౌకర్యాలు అందడం లేదని పలువురు ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
కొరాపుట్: బీజూ పట్నాయక్ విగ్రహం ప్రతిష్టాపన వివాదం చిలికిచిలికి గాలి వానలా మారింది. ఇది బీజేడీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. గురువారం బీజూ పట్నాయక్ 28వ వర్ధంతి అందుకు వేదిక కానుంది.
ఇదీ వివాదం..
జయపూర్ పట్టణంలో ఆరు అడుగుల బీజూ పట్నాయక్ విగ్రహం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందు తగ్గట్లు మూడేళ్ల క్రితం విగ్రహం తీసుకొచ్చారు. అయితే ముఖంలో బీజూ రూపురేఖలు లేవని అత్యధికులు అభిప్రాయపడటంతో దానిని వెనక్కి పంపించారు. మరలా రెండేళ్ల క్రితం మరో విగ్రహం తీసుకొచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో ఉన్న ఆ విగ్రమాన్ని నేటికీ ప్రతిష్టాపన చేయలేదు. కార్యాలయం వెనుక భాగంలోనే విగ్రహం పడి ఉంది. ఈ విగ్రహ ప్రతిష్ట కోసం వివాదం చెలరేగింది.
మున్సిపల్ కౌన్సిల్‌లో ఏకాభిప్రాయం..
జయపూర్ మున్సిపల్ కౌన్సిల్‌లో చైర్మన్ నరేంద్ర మహంతి కాంగ్రేస్ పార్టీకి చెందిన్పటికీ వారికి 13 మంది సభ్యులు ఉన్నారు. వైస్ చైర్మన్ బి.సునీత బీజేడీ పార్టీకి చెందినప్పటికి వారికి 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బలాబలాలలో తేడా, పార్టీల మధ్య విబేధాలు ఉన్నప్పటికీ విగ్రహ ప్రతిష్ట విషయంలో ఏకాభిప్రాయం ఉంది. అయినా రెండేళ్లపైగా విగ్రహం మూలనే పడి ఉంది.
రబినారాయణ నందో అల్టిమేటం..
బిజూ విగ్రహం రెండేళ్లుగా ప్రతిష్ట కాకపోవడం తీవ్ర విచారకరమని బీజేడీకి చెందిన మాజీ మంత్రి
న్యూస్‌రీల్
రబినందో ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 17లోగా ప్రతిష్ట పనులు ప్రారంభం కాకపోతే ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. తమ నాయకుడు విగ్రహ ప్రతిష్ట సత్వరం జరిగేలా చర్యలు తీసుకోవాలని అల్టిమేటం ఇచ్చారు.
వివాదం!
వివాదం!


