టిప్పర్‌ కింద నరకయాతన | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ కింద నరకయాతన

Apr 19 2025 9:44 AM | Updated on Apr 19 2025 9:44 AM

టిప్ప

టిప్పర్‌ కింద నరకయాతన

కొరాపుట్‌: కొరాపుట్‌ జిల్లా బొయిపరిగుడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జాతీయ రహదారి–326 పై నంగర్‌పొఖాన్‌ గ్రామ సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో శుక్రవారం ఓ ట్రక్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రక్‌ కింద డ్రైవర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ చిక్కుకుపోయాడు. ఈ ట్రక్‌ లో భారీ ఇనుప స్క్రాప్‌ ఉండడంతో మరింత బరువుతో ట్రక్‌ కిందకు వంగిపోయింది. ఆ మార్గంలో వెళ్తున్న వారు బొయిపరిగుడ పోలీసులకు సమాచారం అందజేశారు. ఇదే సమయంలో ఆ పరిధిలో ఉన్న బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌కి సమాచారం రావడంతో జవానులు ట్రక్‌కు రక్షణగా నిలిచారు. బొయిపరిగుడ నుంచి ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది చేరుకొని డ్రైవర్‌ని బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. అయితే అతను బతికే ఉన్నట్లు తెలియడంతో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న జయపూర్‌ అగ్ని మాపక కేంద్ర అధికారి సురేష్‌ బారిక్‌ తన సిబ్బంది అప్రమత్తం చేశారు. అత్యవసర సమయాల్లో స్పందించే క్విక్‌ యాక్షన్‌ సభ్యులతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. భారీ క్రేన్‌న్‌, హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ ద్వారా బాధితుడిని బయటకు తీసారు. ఐదు గంటలకుపైగా మృత్యువుతో పోరాడిన భువనేశ్వర్‌ ఎట్టకేలకు బయటకు వచ్చాడు. బాధితుడు ట్రక్‌ నుంచి క్షేమంగా బయటకు వస్తున్నప్పుడు ఆ ప్రాంతమంతా చప్పట్లతో దద్దరిల్లింది. అనంతరం క్షతగాత్రుడిని బొయిపరిగుడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఫైర్‌ సిబ్బందికి ప్రజల నుండి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి.

టిప్పర్‌ కింద నరకయాతన1
1/4

టిప్పర్‌ కింద నరకయాతన

టిప్పర్‌ కింద నరకయాతన2
2/4

టిప్పర్‌ కింద నరకయాతన

టిప్పర్‌ కింద నరకయాతన3
3/4

టిప్పర్‌ కింద నరకయాతన

టిప్పర్‌ కింద నరకయాతన4
4/4

టిప్పర్‌ కింద నరకయాతన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement